KMR: ఇండియన్ రెడ్ క్రాస్‌లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వ నమోదు కార్య క్రమాలను నిర్వహించాలని, సామాజిక కార్య క్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు.