సత్యసాయి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NH 342, NH 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు-కడప-విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.