హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రెస్‌మీట్ ఎందుకు పెడుతున్నారు అనేది క్లారిటీ లేకపోయినా.. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.