రష్యా అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో రెండో రోజు ప్లీనరీ సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా వ్లాదిమర్ పుతిన్ మాట్లాడుతూ ఈ కూటమిలో చేరడానికి 30 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. సమర్థంగా పనిచేయడాన్ని దృష్టిలో పెట్టుకొనే గ్రూపు విస్తరణపై చర్చలు జరుపుతామని వెల్లడించారు. స్థిరమైన బహుము ప్రపంచాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.