టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల, యువచంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘పొట్టెల్’. తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ టైలర్ చూశానని.. చాలా బాగుందని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు. ఇక దర్శకుడు సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 25న విడుదలవుతుంది.