ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఫౌజీ’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చెన్నైలో పూర్తి కాగా.. తాజాగా రెండో షెడ్యూల్‌పై అప్డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ సెట్స్ వేయనున్నట్లు సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో యువ నటి ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.