GNTR: కాశ్మీర్‌కు చెందిన యువత మంగళవారం అమరావతిని సందర్శించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే యూత్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిన 132 మంది అమరావతిలోని ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్, పురావస్తు ప్రదర్శనశాల, మహాచైత్యం సందర్శించారు. ఉండవల్లి గుహలను కూడా వారు సందర్శించారు. అమరావతి అద్భుతంగా ఉందని వారు కొనియాడారు.