TG: మాజీమంత్రి కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. కాగా.. మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సాక్ష్యం నమోదుకు ఈ నెల 18న మాజీమంత్రి కోర్టుకు వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.