NLG: ఆంక్షలు లేకుండా పత్తిని ప్రభుత్వ నిర్ణయ ధర ప్రకారం కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర సభ్యులు నర్సింహా అన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశానికి హాజరై మాట్లాడారు. పత్తి రైతులు ఇప్పటికే వర్షాల కారణంగా పూర్తిగా పంటలు నష్టపోయిన నేపథ్యంలో తేమ శాతం పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదు అన్నారు.