అనంతపురం: ప్రభుత్వ బాలికల ఐటీఐలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ నందకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు ప్రత్యేకంగా దుస్తుల తయారీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 26వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న ధ్రువపత్రాల పరిశీలన, 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు.