ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్‌లో పవన్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.