ప్రభుత్వ రంగ నెట్వర్క్ ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’ (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ‘జ్యోతిరాదిత్య సింధియా’ ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.