TG: పరిశ్రమల స్థాపనలో బీసీ యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చేయూతనందించాలని ‘బిక్కి’ చేసిన ప్రతిపాదనకు మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. బీసీ పారిశ్రామిక విధానం, బీసీ ప్రొక్యూర్మెంట్ పాలసీల గురించి ‘బిక్కి’ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. బీసీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వం తరఫున లభించాల్సిన పరిష్కారం, అందాల్సిన సహాయ సహకారాల గురించి చర్చలు జరిగాయి.