KDP: ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి దివిజా తెలియజేశారు. ఆధార్ కార్డు తీయించుకొని పదేళ్లు దాటిన వారు ఫోన్ నంబర్, అడ్రస్‌లో మార్పులు సరి చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలోపు బాలబాలికలు బాల ఆధార్ నమోదు చేయించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.