AP: మాజీ సీఎం జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని.. జగన్ అసెంబ్లీకి రావాలన్నారు. ‘జగన్! అసెంబ్లీకి రావయ్యా.. సరదాగా ముచ్చటించుకుందాం’ అని చలోక్తి విసిరారు. మాజీ సీఎం అసెంబ్లీకి వచ్చి తనకు నమస్కారం పెడితే చూద్దామని ఉందని, కానీ రాలేదన్నారు. అనకాపల్లి జిల్లాలో ‘పల్లె పండుగ’ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.