AP: విభజన సమయంలో చంద్రబాబు ఏపీ, తెలంగాణ…రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కన్నును ఆయన తీసేసుకున్నారా? అని ప్రశ్నించారు. తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించడం లేదన్నారు. డయల్ యువర్ ఈవోలో తెలంగాణ లెటర్లు అనుమతించబోమని చెప్పారని ఆరోపించారు. యాదాద్రి, భద్రాచలం పుణ్యక్షేత్రాలలో ఏపీ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలకు దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.