నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుకి గాను చిత్ర పరిశ్రమ నుంచి బాలకృష్ణ పేరును ఖరారు చేసి కేంద్రానికి పంపబోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మాజీ ఎంపీ మురళీ మోహన్ పేరును కూడా సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, బాలకృష్ణ తన సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.