సినీ నటి సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్రబృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సిరీస్‌కు మొదట సమంతను అనుకోలేదని దర్శకుడు చెప్పారు. పదాలు పలకడంలో లోపాలుంటాయేమోనన్న భయంతో తాను హిందీ మాట్లాడానని సామ్ తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.