AP: బాలయ్య రియాల్టీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ప్రజలు కష్టాలను పట్టించుకోకుండా చంద్రబాబు రియాల్టీ షోకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినన్ని దారుణాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని రోజా విమర్శించారు.