AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, ఏడాదికి రూ.3వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.