TG: BRS చేస్తున్న ధర్నాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో పథకాలను అటకెక్కించారని మండిపడ్డారు. ఓటమితో రైతుల తరపున ధర్నాలు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అబద్దపు ప్రచారానికి కేటీఆర్ తెరలేపారంటూ విమర్శించారు. కాగా, BRS నేతలు ఇవాళ రుణమాఫీ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేసిన విషయం తెలిసిందే.