TG: గ్రూప్-1 పరీక్షలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో పరీక్షలు యథాతథంగా జరిగి తీరుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిరుద్యోగులను నిండా ముంచిన విపక్షాల మాయలో పడి అభ్యర్థులు తమ జీవితాలను ఆగం చేసుకోవద్దవని సూచించారు. అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా.. నిరాశ ఎదురవ్వడంతో అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, అభ్యర్థులు రేపు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.