2014లో ఐసిస్ కిడ్నాప్ చేసిన ఓ మహిళను ఇజ్రాయెల్ బలగాలు రక్షించి తమ కుటుంబానికి అప్పగించాయి. పదేళ్లు ఐసిస్ చేతిలో బందీగా ఉన్న ఫౌజియా అమీన్ సిడో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. అక్కడి వారు యజిదీ శిశువులను చంపి వండి పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. టెర్రరిస్టులు తనను కిడ్నాప్ చేసినప్పుడు తన వయసు 9 ఏళ్లని, ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారు ఇప్పుడు కూడా ఐసిస్ చేతిలోనే ఉన్నారని తెలిపారు.