MDK: జగదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వర్షాకాల రైతు భరోసాను రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన కారణంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు పూర్తిగా మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.