న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్ WTC ఫైనల్‌కు చేరుకోవాలంటే రాబోయే మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ప్రస్తుతం NZతో ఓడిపోయినప్పటికీ భారత్ WTC 2023-25 పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలోనే కొనసాగుతోంది. WTCలో భారత్ ఇంకా కివీస్‌తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్ చేరుకోవాలంటే ఈ 7 మ్యాచుల్లో భారత్ కనీసం 4 మ్యాచ్‌లు తప్పకుండా విజయం సాధించాలి.