KKD: సామర్లకోటలోని వీరరాఘవపురం సత్తెమ్మ తల్లి గుడి సమీపంలో విద్యుత్ షాక్తో తల్లీకొడుకు మృతి చెందిన విషాదకర ఘటన జరిగింది. పద్మ శనివారం బట్టలు ఆరేస్తూ కరెంటు షాక్ తగిలి మృతి చెందారు. అక్కడ షాక్ వస్తుందని తెలియని కొడుకు విశ్వాస్ నాని అదే తీగలు ముట్టుకోవడం వల్ల ఆదివారం మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.