KNR: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్లో ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, పేటీఎంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు.