అన్నమయ్య: ‘కనువిప్పు’ లఘు చిత్రం పెద్దలపట్ల బాధ్యతను తెలియజేస్తుందని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ముని గోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం మదనపల్లె పట్టణంలో లఘు చిత్రం దర్శకుడు రాజా, ఎడిటర్ రాజ్ కుమార్లను వారు సత్కరించారు. ఈ లాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.