TG: రియల్ ఎస్టేట్ అంశంలో సీఎం రేవంత్ ఆదేశాలపై తాజాగా హైడ్రా స్పందించింది. అనుమతులున్న వెంచర్ల వారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. చెరువుల దగ్గర అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారన్న సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని హైడ్రా తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై హైడ్రా కట్టుబడి ఉందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు.