MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.