చైనాలో బీఎండబ్ల్యూ కంపెనీ దాదాపు 7 లక్షల బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలో కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్మేకర్ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది. ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.