ప్రపంచ క్రికెట్లో భయమెరుగని క్రికెటర్లలో మొదట గుర్తొచ్చేది వీరేంద్ర సెహ్వాగ్. ఇవాళ ఆయన పుట్టినరోజు. బౌలర్‌తో సంబంధం లేకుండా తొలిబంతి నుంచే వారిపై ఆధిపత్యం చెలాయిస్తూ విధ్వంసం సృష్టించడం ఆయన ప్రత్యేకత. విధ్వంసానికి మారుపేరుగా ముద్ర వేసిన ఆయన టెస్టుల్లో 2 ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. భారత్ తరఫున 374 మ్యాచ్‌లు ఆడి 17,253 పరుగులు చేశాడు.