టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఆయనను సంప్రదించగా.. విష్ణు ఒకే చెప్పాడట. ఈ మూవీ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారట.