శ్రీసత్యసాయి: చిలమత్తూరు మండలంలో ఈనెల 12 అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబుపై ఈ ఘటనపై సీరియస్ కావడంతో కేసు విచారణ చురుగ్గా జరుగుతోంది. ఇందులో భాగంగా బాధితులైన అత్త, కోడలిని ఉరవకొండకు శనివారం తీసుకు వచ్చారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి వారి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.