గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్ ఎమ్మెల్యే పర్మార్ 2020 జూలై 30న గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.