MBNR: విద్యార్థులు క్రమశిక్షణతో కృషి చేస్తే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సురక్ష పోలీసు కళాబృందం వారి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తును కోల్పోవాల్సి ఉంటుందన్నారు.