హర్యానాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను పంపిణీ చేసింది. టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను పండుగ బహుమతిగా ఇచ్చినట్లు ఆ కంపెనీ యజమాని ఎన్.కె.భాటియా తెలిపారు. ‘స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన 15 మంది కంపెనీ ఉద్యోగులకు ఈ కానుకలను అందించారు. అయితే ఈ వాహనాలకు కంపెనీ పనికి వాడితే కారు ఇంధనం ఖర్చును సంస్థే భరించనుంది.