రానున్న రోజుల్లో దేశంలోని రహదారి మౌలిక సదుపాయాలు అమెరికా కంటే మెరుగ్గా ఉండబోతున్నాయని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన రహదారి, జల, రైలు మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామన్నారు. తారు రోడ్లకు ప్రతిసారీ గుంతలు పూడ్చుకునే బదులు వైట్ కాంక్రీట్ టాపింగ్ రోడ్ల నిర్మాణాన్ని చేపడితే 25 ఏళ్ల వరకు ఢోకా ఉండదన్నారు.