NRML: జిల్లా కేంద్రంలోని అతి పురాతన దేవాలయమైన దేవరకోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు దర్శించుకున్నారు. ఇటీవలే దేవరకోట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. శ్రీహరి రావుకు పండితులు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.