NLR: నెల్లూరులోని కూరగాయల మార్కెట్లో మళ్లీ కిలో టమాటా ధర రూ.100 పలుకుతుంది. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి వర్షాన్ని బూచిగా చూపించి ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మార్కెటింగ్ శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడం, అడ్డూ అదుపు లేకుండా వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.