GNTR: ప్రైవేటు యూనివర్సిటీలకు ధీటుగా ANUలో వరల్డ్ క్లాస్ కోర్సులు అందుబాటులోకి తేవాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ టీడీపీ నాయకులు కొర్రపాటి సురేష్ కోరారు. ఈ మేరకు నాగార్జున యూనివర్సిటీలో ఉపకులపతి ఆచార్య గంగాధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గంగాధర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.