AP: విశాఖపట్నంలో వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజల కోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని వెల్లడించారు. త్వరలో మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయని పేర్కొన్నారు.