AP: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అని ఎద్దేవా చేశారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెబుతారని.. కానీ టీడీపీ నేతలు మాత్రం వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని అన్నారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని.. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు.