జార్ఖండ్ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో DGP అనురాగ్ గుప్తాను వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇవాళ సాయంత్రం 7 గంటలలోగా దీనిపై నివేదికను సమర్పించాలని తెలిపింది. గత ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి మద్దతుగా వ్యవహరించినట్లు పలు ఫిర్యాదులు రావడంతో EC ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, జార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.