ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు HDFC త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ మధ్య స్టాండలోన్ ప్రాతిపదికన రూ.16,821 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15,976 కోట్లతో పోలిస్తే 5 శాతం మేర వృద్ధి చెందింది. త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.