SKLM: సిగడాం మండలం డీఆర్ వలస గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం శనివారం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేశారు. పల్లెలలో మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.