విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రోజు 10 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 5 ఇండిగో, 5 ఆకాశా ఎయిర్ లైన్స్ విమానాలకు హెచ్చరికలు వచ్చాయని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో 70 విమానాలకు బెదిరింపులు వచ్చాయని.. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో దేశ భద్రతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.