KDP: కొండాపురం రైల్వే స్టేషన్లో శుక్రవారం హుబ్లీ ప్యాసింజర్ రైలు కిందపడి సుజాత (36) అనే మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన ఈమె కొండాపురం రైల్వే స్టేషన్లో నీళ్లు తాగడానికి దిగింది. రైలు కదులుతుండగా ఎక్కబోతు ప్రమాదవశాత్తు జారి రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.