SKLM: సారవకోట మండలం కుమ్మరిగుంట పంచాయతీలో పంచాయతీ అధికారులు శనివారం ‘పల్లె పండుగ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిమిడి రోడ్డు నుంచి సోమయ్యపేట గ్రామం వరకు 1 కి.మీ బిటి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని అన్నారు.