W.G: గోపాలపురం నూతన తహసీల్దార్‌గా విద్యాపతి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా గోపాలపురానికి వచ్చారు. శనివారం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.